Header Banner

నేను ఎప్పుడూ విద్యార్థిగానే ఉంటా.. ప్రతి రోజు నేర్చుకుంటున్నా! టెక్ ఏఐ వేదికపై సీఎం సందేశం!

  Wed May 14, 2025 15:28        Politics

టెక్ ఏఐ కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ, "నేను ఎప్పుడూ విద్యార్థిగానే ఉంటా. ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాను" అని తెలిపారు. సాంకేతికత ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని, ప్రపంచం ఎక్కడ చూసినా భారతీయులు ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా, ఆ మంది భారతీయులలో తెలుగువాళ్లు అధికమని పేర్కొన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో 35 శాతం వరకు తెలుగువాళ్లు ఉన్నారని తెలిపారు.

1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని మార్చేశాయని, అప్పటివరకు లైసెన్స్ రాజ్ కారణంగా ఏ పని చేయాలన్నా ప్రభుత్వ అనుమతులు అవసరమైయ్యేదని గుర్తు చేశారు. ఐటీ రంగం అప్పుడే మొగ్గు తొడుగుతుండగా, దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నామని చెప్పారు. ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం పుణ్యమా అని భారీగా అభివృద్ధి సాధించామని గుర్తుచేశారు.

గతంలో రహదారులు గుంతలతో ఉండేవని, ఇప్పుడు జాతీయ రహదారుల అభివృద్ధి చూస్తే ఎంతో సంతోషంగా ఉందన్నారు. సంపదను సృష్టించి ప్రజలకు అందించాలనే దిశగా తమ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా వ్యవసాయంలో టెక్నాలజీని ప్రవేశపెట్టి అద్భుతాలు సాధించామని చెప్పారు. పశుసంపద రంగంలో 42 లక్షల మందికి ఉపాధి లభించిందని, పరిశ్రమలు వస్తే ఆదాయం, ఉపాధి రెండూ పెరుగుతాయని చెప్పారు.

వ్యవసాయం, తిండి, అలవాట్లపై ఆరోగ్యం ఆధారపడుతుందని, మైక్రో ఇరిగేషన్‌కు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ చిరునామా అవుతుందని అన్నారు. సాంకేతిక యుగంలో సమర్థత పెంచుకోవాలంటే, తప్పకుండా టెక్నాలజీని అనుసరించాలని చంద్రబాబు సూచించారు.

ఇది కూడా చదవండిఏపీలో ఇకపై ఆ రూల్స్ పాటించాల్సిందే..! ప్రభుత్వం కీలక ఆదేశాలు..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..


 నేడు (14/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #CMChandrababu #TechAIConclave #AlwaysLearning #StudentForLife #InnovationLeadership